Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీ నామా ఆస్తులు జప్తు
కేసీఆర్ కు కోలుకోలేని బిగ్ షాక్
Nama Nageswara Rao : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మాకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఢిల్లీ మద్యం స్కాంలో దాడులు చేపట్టింది. సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేలా మెల మెల్లగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయనకు దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లు, ఎంపీలను టార్గెట్ చేసింది.
తాజాగా కోట్లాది రూపాయలు కలిగిన ఎంపీగా పేరుంది నామా నాగేశ్వర్ రావుకు(Nama Nageswara Rao). సోమవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది ఎంపీకి. ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) . ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు చెందిన రూ. 80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఎంపీ నామాకు చెందిన మధుకాన్ కంపెనీ రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా నామా నాగేశ్వర్ రావుకు చెందిన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఈ కేసులో రూ. 73.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే ఈ ప్రాజెక్టు కింద బ్యాంకుల నుంచి రూ. 361. 29 కోట్లను నామా రుణాలుగా తీసుకున్నారు. ఈ మొత్తం రుణాలకు సంబంధించిన డబ్బులను దారి మళ్లించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు, ఇతర ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నామా నాగేశ్వర్ రావు కు షాక్ ఇచ్చిన ఈడీ మరి ఎంత మంది లిస్టులో ఉన్నారనేది తేలనుంది.
Also Read : రౌత్ కు పట్టిన గతే సిసోడియాకు కూడా