Venuswami : ప్రముఖ జ్యోతిష్యుడు ‘వేణు స్వామి’ పై వెలుగులోకి సంచలన విషయాలు

దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆయనకు నోటీసులు జారీ చేశారు...

Venuswami : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి సంచలన నిజం బయటపడింది. ప్రముఖ జ్యోతిష్యుడినంటూ చెప్పుకుంటున్న వేణు స్వామి.. అసలు జ్యోతిష్యుడే కాదని, నకిలీ జ్యోతిష్యుడు అంటూ బ్రాహ్మణ సంఘాలు తేల్చి చెప్పాయి. ఈ మేరకు వేణుస్వామి గురించి బ్రాహ్మణ సంఘాల నేతలు ఓ వీడియో రిలీజ్ చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ.. వేణుస్వామి బండారాన్ని బయటపెట్టారు.

బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడని.. వేణు స్వామి(Venuswami అసలు బ్రాహ్మణుడే కాదని తెలిపారు. బ్రాహ్మణులు 72 శాఖలలో ఏ శాఖకి చెందిన వాడు కాదని స్పష్టం చేశారు. నిజంగా వేణు స్వామి బ్రాహ్మణుడే అయితే బయటికి వచ్చి నిరూపించుకోవాలన్నారు. బ్రాహ్మణుడి పేరుతో సినిమా వాళ్లను, రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలను మోసం చేస్తున్నాడన్నారు. వేణు స్వామికి బ్రాహ్మణ జాతికి ఎలాంటి సంబంధం లేదని.. మరొకసారి బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వేణు స్వామి జాతకాలతో మోసపోకండి అంటూ బండారం మొత్తం శ్రీధర్ శర్మ వీడియోలో బట్టబయలు చేశారు.

Venuswami Comment

కాగా… ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై వేణుస్వామి(Venuswami) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..వారు త్వరలో విడిపోతారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అసలే సమంతతో విడిపోయి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తమ అభిమాన హీరో జీవితం గురించి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జంట వైవాహిక జీవితంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కొందరు జర్నలిస్టులు, ఫ్యాన్స్ ఆయనపై మహిళా కమిషన్‍కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు సవాల్ చేస్తూ ఆయన హైకోర్టు తలుపు తట్టారు. గతంలోనే అనేక మంది సెలబ్రెటీల పర్సనల్ లైఫ్‌కు సంబంధించి కూడా వేణుస్వామి పలు వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత వివాహ సమయంలోనూ వారు త్వరలో విడిపోతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అలాగే కొణిదల ఉపాసన, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహా అనేక మంది గురించి ఆయన తీవ్రంగా మాట్లాడారు. దీనిపై ఆయా హీరో, హీరోయిన్ల ఫ్యాన్స్ అతనిపై నిప్పులు చెరిగారు.

Also Read : Minister Nimmala : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థ నాశనం

Leave A Reply

Your Email Id will not be published!