Sanju Samson : ఈసారైనా సంజూ శాంసన్ రాణించేనా
రెండు మ్యాచ్ లలో వరుస డకౌట్లు
Sanju Samson : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్నాడు. కెప్టెన్ గా సక్సెస్ అయినా వ్యక్తిగతంగా రాణించలేక పోవడం ఇబ్బందికరంగా మారింది. తొలి, రెండో మ్యాచ్ లలో సత్తా చాటాడు. మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరితో ఆకట్టుకుంటే రెండో మ్యాచ్ లో 42 రన్స్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు కెప్టెన్ సంజూ శాంసన్. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన సంజూ 97 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బ్యాటర్లలో టాప్ లో కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేశాడు స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్.
ఆదివారం గుజరాత్ లోని మోదీ అహ్మదాబాద్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడనుంది రాజస్థాన్ రాయల్స్. ఇరు జట్లు నాలుగు మ్యాచ్ లు ఆడాయి. మూడు మ్యాచ్ లు గెలుపొందాయి. ఒక మ్యాచ్ లో ఓటమి పాలయ్యాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా రాజస్థాన్ టాప్ లో ఉండగా 3వ స్థానంలో కొనసాగుతోంది గుజరాత్ టైటాన్స్.
ఈ ఏడాది 2023లో బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఐపీఎల్ లో రాణిస్తేనే సంజూ శాంసన్(Sanju Samson) కు భారత జట్టులో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. ఇకనైనా శాంసన్ రాణించాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
Also Read : ముంబై గెలిచేనా కోల్ కతా నిలిచేనా