Rajiv Swagruha Auction : 14న రాజీవ్ స్వ‌గృహ ఆస్తుల వేలం

ప్ర‌క‌టించిన టీఆర్ఎస్సీఎల్

Rajiv Swagruha Auction : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఆస్తుల అమ్మ‌కానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రియ‌ల్ ఎస్టేట్ దందా పెద్ద ఎత్తున కొన‌సాగుతోంది. మ‌రో వైపు ఆర్థిక మాంద్యం అన్ని రంగాల‌ను ప్ర‌భావితం చేస్తోంది. తాజాగా తెలంగాణ రాజీవ్ స్వగృహ(Rajiv Swagruha Auction) కార్పొరేష‌న్ లిమిటెడ్ (టీఆర్ఎస్సీఎల్ ) ఆధ్వ‌ర్యంలో న‌వంబ‌ర్ 14న 10 జిల్లాల్లో ఆస్తుల‌ను వేలం వేయ‌నుంది.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది సంస్థ‌. ఇందుకు సంబంధించి అక్టోబ‌ర్ 11న వేలం నోటిఫికేష‌న్ వెలువ‌డుతుంది. అధికారులు ప్ర‌త్య‌క్షంగా , ఈ వేలం ప‌ద్ద‌తిలో నిర్వ‌హిస్తారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను హైద‌రాబాద్ మెట్రో పాలిటిన్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చేప‌ట్ట‌నుంది.

ఆయా జిల్లాలో చేప‌ట్టే వేలం పాట బాధ్య‌త‌ల‌ను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించింది. తెలంగాణ‌లోని ఆదిలాబాద్ , కామారెడ్డి, క‌రీంన‌గ‌ర్ , మ‌హ‌బూబ్ న‌గ‌ర్ , న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్ , రంగారెడ్డి, వికారాబాద్, ఖ‌మ్మం, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాల్లో ప్లాట్లు, ఇళ్లు, వాణిజ్య ప్లాట్ల‌ను వేలం వేయ‌నున్నారు.

ఇక ఆదిలాబాద్, కామారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ , న‌ల్ల‌గొండ‌, క‌రీంన‌గ‌ర్ , వికారాబాద్ క‌లెక్ట‌ర్లు వేలం నోటిఫికేష‌న్ కు హాజ‌రైన‌ట్లు ధ్ర‌వీక‌రించారు. ఇక తొర్రూరు, తుర్క‌యాంజాల్ , బ‌హ‌దూర్ ప‌ల్లి, కుర్మ‌ల్ గూడ‌, అమిస్తాపూర్ లే అవుట్ లోని క‌మ‌ర్షియ‌ల్ ప్లాట్ లో కూడా హెచ్ ఎం డీఏ వేలం పాట నిర్వ‌హించ‌నుంది. అంతే కాకుండా చందాన‌గ‌ర్, క‌వాడిప‌ల్లిలో టీఎస్ఐఐసీ ఈ వేలం చేప‌ట్ట‌నుంది.

Also Read : న్యూజిలాండ్ తో బంధం బ‌లోపేతం – జై శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!