Aung San Suu Kyi : ఆంగ్ సాన్ సూకీకి 5 ఏళ్ల జైలు శిక్ష

సంచ‌ల‌న తీర్పు చెప్పిన కోర్టు

Aung San Suu Kyi  : మ‌య‌న్మార్ (బ‌ర్మా) అగ్ర నాయ‌కురాలు ఆంగ్ సాన్ సూకీకి కోలుకోలేని రీతిలో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల‌దోసింది అక్క‌డి ఆర్మీ. ఆంగ్ సాన్ సూకీతో(Aung San Suu Kyi )పాటు నేత‌ల‌ను నిర్బంధించింది.

ప్ర‌శ్నించిన వేలాది మందిని అరెస్ట్ చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా మార‌ణ హోమానికి పాల్ప‌డింది. ఇదే స‌మ‌యంలో ఆంగ్ సాన్ సూకీకి మ‌ద్దతుగా నిలిచిన వారిపై తుపాకులు ఎక్కు పెట్టింది.

ఇదే స‌మ‌యంలో సూకీపై సైనిక స‌ర్కార్ 11 అవినీతి కేసుల‌ను బ‌నాయించింది. ఈ కేసుల‌ను విచారించింది జుంటా కోర్టు. సూకీని దోషిగా తేల్చింది. 6 ల‌క్ష‌ల డాల‌ర్ల న‌గ‌దు, 11.4 కేజీల గోల్డ్ ను లంచం ద్వారా తీసుకున్న‌ట్లు ఆంగ్ సాన్ సూకీని నిర్దారించింది.

నేరం నిరూప‌ణ కావ‌డంతో సూకీకి (Aung San Suu Kyi )కోర్టు 5 ఏళ్ల పాటు జైలు శిక్షను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. దీనిని ఆల్ఫా న్యూస్ ధ్రువీక‌రించింది. కాగా మ‌య‌న్మార్ లో ఇప్పుడు ఏం జ‌రిగినా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

ఈ సైనిక స‌ర్కార్ కు వెనుక నుంచి చైనా మ‌ద్ధ‌తు ఇస్తోంది. విచిత్రం ఏమిటంటే మొత్తం కేసులో 1 కేసులో మాత్ర‌మే తీర్పు వ‌చ్చింది. ఇంకా 10 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

వీటిని కూడా విచారిస్తే ఆమె పుణ్య కాల‌మంతా జైలులోనే గ‌డిచేలా ఉంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు దేశం కోసం పోరాడింది. సైనిక ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పింది. 1991లో నోబెల్ బ‌హుమ‌తి కూడా ల‌భించింది ఆంగ్ సాన్ సూకీకి.

Also Read : పుతిన్ పై డొనాల్డ్ ట్రంప్ క‌న్నెర్ర

Leave A Reply

Your Email Id will not be published!