AUS vs AFG ICC World Cup : ఆఫ్గాన్ ప‌రేషాన్ ఆసిస్ సెన్సేష‌న్

వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డ్

AUS vs AFG ICC World Cup : ముంబై – ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో అద్భుతం చోటు చేసుకుంది. ఎక్క‌డా ఏ కోశానా ఆశ‌లు లేని ఆస్ట్రేలియాను విజ‌య తీరాల‌కు చేర్చిన ఘ‌న‌త గ్లెన్ మ్యాక్స్ వెల్ కు ద‌క్కింది. వ‌ర‌ల్డ్ క‌ప్(World Cup) చ‌రిత్ర‌లో ఇది అరుదైన రికార్డ్. అంతే కాదు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టోర్నీలో ఈ మ్యాచ్ హైలెట్ గా నిలిచింది.

AUS vs AFG ICC World Cup Updates

ఒకానొక ద‌శ‌లో ఆఫ్గ‌నిస్తాన్ దే పై చేయి అంది. ఆ జ‌ట్టు అప్ర‌హ‌తిహ‌తంగా విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చింది. కానీ ఒకే ఒక్క‌డు ఒంట‌రి పోరాటం చేశాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. యుద్దంలో ఎలా గెల‌వాలో అత‌డిని చూసి నేర్చు కోవాలి. ప్రొఫెష‌న‌లిజం అంటే ఎలా ఉంటుందో మ్యాక్స్ వెల్ ను చూస్తే అర్థం అవుతుంది.

అయినా ప్ర‌త్య‌ర్థి ఆఫ్గాన్ జ‌ట్టును త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలు లేదు. ఆ జ‌ట్టు ఇప్ప‌టి దాకా నెద్ద‌ర్లాండ్స్ , ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీ‌లంక లాంటి బ‌ల‌మైన జ‌ట్ల‌ను మ‌ట్టి క‌రిపించింది. ఆ జ‌ట్టుకు జోనాథ‌న్ , అజ‌య్ జ‌డేజా కోచ్, మెంటార్ గా వెళ్లాక సీన్ మారింది. ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ లో త‌మ వైపు చూసుకునేలా ఆడుతోంది ఆఫ్గాన్.

ఇది ప‌క్క‌న పెడితే మ్యాచ్ విష‌యానికి వస్తే తొలుత 3 వికెట్ల తేడాతో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యం సాధించింది. వాంఖ‌డే మైదానం ప‌రుగ‌ల‌తో ద‌ద్ద‌రిల్లి పోయింది. ఆసిస్ సెమీస్ కు చేరుకుంది ఈ గెలుపుతో. దీంతో టోర్నీలో ఇండియా, స‌ఫారీతో పాటు ఈ జ‌ట్టు చేరింది.

తొలుత మైదానంలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ జ‌ట్టు 292 ర‌న్స్ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 46.5 ఓవ‌ర్ల‌లో 293 ర‌న్స్ చేసి స‌క్సెస్ సాధించింది. మ్యాక్స్ వెల్ 128 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 10 సిక్స్ లతో 201 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

91 ర‌న్స్ కే 7 వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచుల్లో ఉన్న జ‌ట్టును ఒక్క‌డే గెలిపించాడు. ఇక ఆఫ్గాన్ జ‌ట్టులో ఇబ్ర‌హీం బ‌దాన్ 129 ర‌న్స్ చేస్తే ర‌షీద్ ఖాన్ 35 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : IND vs SA ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ జైత్ర‌యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!