AUS vs NED ODI World Cup : ఆస్ట్రేలియా జోర్దార్ విక్టరీ
309 రన్స్ తేడాతో సెన్సేషన్ విక్టరీ
AUS vs NED ODI World Cup : న్యూఢిల్లీ – ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్ పై ఏకంగా 309 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ టోర్నీలో ఆసిస్ కు ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం.
AUS vs NED ODI World Cup Updates
ఆసిస్ ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. ఓ వైపు గ్లెన్ మ్యాక్స్ వెల్ రెచ్చి పోతే ఇంకో వైపు డేవిడ్ వార్నర్ తుక్కు రేపాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వన్డే వరల్డ్ కప్ లో గ్లెన్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక వార్నర్ మామకు ఇది వరుసగా ఆరో సెంచరీ .
ముందుగా ఆసిస్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 399 రన్స్ చేసింది. మ్యాక్స్ వెల్ 44 బాల్స్ ఎదుర్కొని 106 రన్స్ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ 93 బంతులు ఎదుర్కొని 104 రన్స్ చేశాడు. 11 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. మాజీ స్కిప్పర్ స్మిత్ 71 రన్స్ చేస్తే లబుషేన్ 62 పరుగులు చేశాడు. దీంతో భారీ స్కోర్ నమోదైంది.
అనంతరం 400 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ చేతులెత్తేసింది. ఆసిస్ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. 20 ఓవర్లలోనే 90 పరుగులకు ఆలౌటైంది.
Also Read : Eatala Rajender : దాడి దారుణం ఈటల ఆగ్రహం