Auto Driver Bangalore : ఈ ఆటో డ్రైవ‌ర్ ఇంగ్లీష్ లో ఎక్స్ ప‌ర్ట్

నెట్టింట్లో ప‌ట్టాభి రామ‌న్ హ‌ల్ చ‌ల్

Auto Driver Bangalore : ఎవ‌రీ ప‌ట్టాభి రామ‌న్ అనుకుంటున్నారా. ఆయ‌న ఇప్పుడు అనుకోకుండా నెట్టింట్లో వైర‌ల్ గా మారారు.

బెంగ‌ళూరులో ఆటో డ్రైవ‌ర్ (Auto Driver Bangalore)గా వ‌చ్చీ పోయే వారిని దించ‌డం ఆయ‌న నిత్యం చేసే ప‌ని.

కానీ ఆయ‌న‌కు ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే. పేరుకే ఆటో డ్రైవ‌ర్ అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. మోస్ట్ పాపుల‌ర్ ఇంగ్లీష్ స్పీక‌ర్. ఆయ‌న క‌థ తెలుసు కోవాలంటే చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది.

ప‌ట్టాభి రామ‌న్ గతంలో లెక్చ‌ర‌ర్ గా ప‌ని చేశాడు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాడు. బెంగ‌ళూరుకు చెందిన నికితా అయ్య‌ర్ అనే ప్రొఫెష‌న‌ల్

త‌న ఆటో రిక్షా డ్రైవ‌ర్(Auto Driver Bangalore) త‌ప్పు ప‌ట్ట లేని రీతిలో ఆంగ్లంలో మాట్లాడ‌టాన్ని చూసి విస్తు పోయింది.

మ‌రింత ఉత్సుక‌త‌త‌తో ప‌ట్టాభి రామ‌న్ ను ఇంగ్లీష్ భాష‌లో అంత ప్రావీణ్యం ఎలా సంపాదించాడో తెలుసుకుని ఆశ్చ‌ర్య పోయింది.

నిఖితా అయ్య‌ర్, ప‌ట్టాభి రామ‌న్ ల మ‌ధ్య సంభాష‌ణ ఏకంగా 45 నిమిషాల‌కు పైగా సాగింది.

ఆన్ లైన్ లో వైర‌ల్ గా మారిన లింక్డ్ ఇన్ లో నిఖిత అయ్య‌ర్ ప‌ట్టాభితో మాట్లాడిన సంభాషణ‌ల్ని డాక్యుమెంట్ చేసింది. ఇవాళ ఉద‌యం నేను జాబ్ కోసం వెళుతున్నా. ఉబెర్ లో చిక్కుకు పోయాను.

ఆటో రిక్షా న‌డుపుతున్న ప‌ట్టాబితో క‌లిసి ప్ర‌యాణం చేశాడు. ద‌య‌చేసి క‌మ్ ఇన్ మేడం. మీరు కోరుకున్న‌ది చెల్లించ‌వ‌చ్చు అంటూ ప‌ట్టాభి రామ‌న్ ఇంగ్లీష్ లో మాట్లాడ‌టాన్ని చూసి తాను విస్తు పోయాన‌ని నిఖితా అయ్య‌ర్ తెలిపింది.

తామిద్ద‌రి మ‌ధ్య 45 నిమిషాల పాటు చ‌ర్చ జ‌రిగింద‌ని తెలిపింది. గ‌తంలో లెక్చ‌ర‌ర్ గా చేశాన‌ని, ఎంఏ, ఎంఇడి చేశాన‌ని చెప్పాడ‌ని పేర్కొంది. 14 ఏళ్లుగా ఆటో న‌డుపుతున్న‌ట్లు చెప్పాడు.

బ‌త‌కానికి జీతం స‌రి పోదు. ఆటో న‌డిపితే రోజుకు 800 నుంచి 1500 దాకా వ‌స్తుంద‌ని తెలిపాడు.

Also Read : న‌వాబ్ మాలిక్ ఫ్లాట్ల‌పై ఈడీ ఆరా

Leave A Reply

Your Email Id will not be published!