Kashmir Files : వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ (Kashmir Files)మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన కలిగించింది. ఈ చిత్రం (Picture) 1990లో జరిగిన వాస్తవ ఘటనను ఆధారంగా తీసుకుని మూవీ అద్భుతంగా తెరకెక్కించారు.
చిత్రానికి సంబంధించి కావాలని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు దేశ ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ మోదీ. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు ఆ మూవీకి వినోదపన్ను మినహాయింపు ఇచ్చాయి.
కొంత మంది ముఖ్యమంత్రులు పూర్తిగా కాశ్మీర్ ఫైల్స్(Kashmir Files) కు మద్దతు ఇచ్చారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని పేర్కొన్నారు ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ.
ఇవాళ సదరు మూవీపై కీలక , ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవాలను, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఈ మూవీని జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ఈ సినిమాను విమర్శిస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోదీ. ఉద్దేశ పూర్వకంగా దాచిన సత్యాన్ని చూపుతుండడంతో కాశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) మూవీని తట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ప్రత్యేకంగా అభినందించారు. వాస్తవాలు, కళల ఆధారంగా సినిమాను సమీక్షించకుండా దానిని కించ పరిచేలా కుట్ర జరుగుతోందంటూ ఫైర్ అయ్యారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలా కాశ్మీర్ పండిట్లను ఊచకోత కోశారనే దానిని హృద్యంగా చిత్రీకరించారు ఫిల్మ్ మేకర్ (Film Maker) . ఇన్నాళ్లు దాచి పెట్టిన నిజం బయటకు రాక పోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు మోదీ.
నిజాన్ని , వాస్తవాలను జీర్ణించు కోలేని వాళ్లే ఆరోపణలు చేస్తారని పేర్కొన్నారు.
Also Read : తెలుగులో రీమేక్ కానున్న మలయాళ ఉడుంబు