Ayodhya: అయోధ్యలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు !
అయోధ్యలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు !
Ayodhya: రామజన్మభూమి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడి సరయూ నదీతీరంలో భక్తివిశ్వాసాలు పెల్లుబికాయి. ఆదివారంఉదయం నుంచి వేలాది మంది భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి, శ్రీరాములవారిని దర్శనం చేసుకుంటున్నారు.
Ayodhya…
గురు పూర్ణిమ సందర్భంగా రామనగరికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి సరయూలో భక్తుల స్నానాలు మొదలయ్యాయి. శ్రీ రాముడు తన గురువైన వశిష్ణుడిని ఆరాధించాడని చెబుతారు. ఈ రోజు రామాలయంలో రోజంతా గురు పూర్ణిమవేడుకలు జరగనున్నాయి.
అయోధ్య(Ayodhya)లో బలరాముని ప్రాణ ప్రతిష్ఠ తరువాత మొదటి సారిగా నిర్వహిస్తున్న గురుపౌర్ణమి వేడుకలు… అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం, బలరాముని సన్నిధిలో ఈ వేడుకలు నిర్వహించడంతో దేశం నలుమూలల నుండి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీనితో బలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం తరువాత అంతటి భక్తుల రద్దీ మరోసారి అయోధ్యలో నెలకొంది.
Also Read : Tranfer of IAS officers: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు ! 63 మంది ఐఏఎస్ లకు స్థాన చలనం !