Ayutha Chandi Yagam : శ్రీ ల‌క్ష్మీ నృసింహ క‌ళ్యాణోత్స‌వం

శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ‌జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ

Ayutha Chandi Yagam : శ్రీ‌కృష్ణ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ ఆధ్వ‌ర్యంలో జ‌డ్చ‌ర్ల ప‌ట్ట‌ణంలో 80వ
విశ్వ శాంతి మ‌హా యాగ మహోత్స‌వం ఘ‌ణంగా కొన‌సాగుతోంది. ఆగ‌స్టు 14న ప్రారంభ‌మైన ఈ యాగం ఆగ‌స్టు 27 వ‌ర‌కు జ‌రుగుతుంది.

బుధ‌వారం 7 గంట‌ల‌కు స‌ర్వ సూక్త‌, సుబ్ర‌హ్మ‌ణ్య స‌మేత సంతాన వేణుగోపాల హోమాలు నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ ల‌క్ష్మీ నృసింహ క‌ళ్యాణ మహోత్స‌వాన్ని క‌నుల పండువ‌గా చేప‌ట్టారు స్వామి వారు.

Ayutha Chandi Yagam in Jadcherla

భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. స్వామి వారి కృప‌కు పాత్రులు అవుతున్నారు. మాజీ మంత్రి చ‌ర్ల‌కోల ల‌క్ష్మారెడ్డి(Laxma Reddy) ఆశీర్వాదం తీసుకున్నారు. మ‌న‌మంతా బాగుండాల‌ని కోరుకుంటూ లోక క‌ళ్యాణం కోసం ఈ యాగాన్ని చేప‌ట్టారు శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానంద స్వామీజీ.

24న గురువారం ఉద‌యం7 గంట‌ల‌కు శ్రీ మేధా ద‌క్షిణ మూర్తి, రామ గాయ‌త్రి స‌హిత చండీ హోమాలు నిర్వ‌హంచారు. సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ సీతారామ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం చేప‌ట్ట‌నున్నారు.

25న శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు చండీ స‌హిత న‌వ దుర్గ హోమాలు , సామూహిక లక్ష్మీ వ్ర‌తం ఉంటుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌ర‌ల‌క్ష్మి అమ్మ వారికి విశేష చ‌క్ర అర్చ‌న‌, పంచామృత అభిషేకం , ల‌క్ష గాజుల అర్చ‌న‌, లక్ష కుంకుమ అర్చ‌న కార్య‌క్రం ఉంటుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

Also Read : Tirumala Yagam : తిరుమ‌ల‌లో కారీరిష్టి యాగం

Leave A Reply

Your Email Id will not be published!