Baba Siddhnath Temple Stampede: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట ! ఏడుగురు మృతి !

బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట ! ఏడుగురు మృతి !

Baba Siddhnath Temple: హాథ్రాస్ తొక్కిసలాట ఘటన మరువక ముందే బీహార్ లో మరో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా… పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అనేక మంది ఒక్కసారిగా ఒకరిపై ఒకరుపడగా, వారి నుంచి ఇంకొంత మంది భక్తులు దూసుకెళ్లారు. ఈ విషాద ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Baba Siddhnath Temple…

బాబా సిద్ధనాథ్ ఆలయంలో(Baba Siddhnath Temple) జరిగిన తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నామని జెహనాబాద్ కలెక్టర్ అలంకృత పాండే తెలిపారు. మరణించిన కుటుంబ సభ్యులను కలిసి విచారిస్తున్నామని, దీనితోపాటు మరికొంత మంది మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అలంకృత పాండే అన్నారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు జెహనాబాద్ ఎస్‌హెచ్‌ఓ దివాకర్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. సిద్ధనాథ్ ఆలయం వద్ద ఉన్న కొండపైకి ఎక్కుతుండగా మెట్లపై తొక్కిసలాట జరిగి గందరగోళ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మృతులు, క్షతగాత్రుల కుటుంబాలతో అధికారులు మాట్లాడుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆసరా అందించడంతోపాటు సరైన విధానాలు పాటించేలా చూడడంపై దృష్టి సారించారు. అయితే తొక్కిసలాటకు గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. గందరగోళాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read : PM Narendra Modi: 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని !

Leave A Reply

Your Email Id will not be published!