Babita Phogat Meets : రెజ్లర్లకు బబితా ఫోగట్ భరోసా
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెల్లడి
Babita Phogat Meets : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ప్రాధాన్యత సంతరించు కోవడంతో కేంద్రం రంగంలోకి దిగింది.
72 గంటల్లోపు వివరణ ఇవ్వాలని డబ్ల్యుఎఫ్ఐని ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున డైరెక్టర్ బబితా ఫోగట్ నిరసన తెలియ చేస్తున్న మహిళా రెజ్లర్ల వద్దకు వచ్చారు(Babita Phogat Meets). ఈ సందర్భంగా ట్రిపుల్ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వినేష్ ఫోగట్ సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ ఎంపీ నిర్వాకం కారణంగా తాను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని వాపోయింది. ఆయనతో పాటు పలువురు కోచ్ లు అథ్లెట్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించింది. వినేష్ ఫోగట్ తో పాటు 30 మంది మహిళా రెజ్లర్లు రోడ్డుపైకి వచ్చారు. ఆందోళన బాట పట్టారు.
గురువారం జరిగిన ధర్నాలో వినేష్ ఫోగట్ , సాక్షి మాలిక్ , బజరంగ్ పునియా కూడా పాల్గొన్నారు. వీరు చేపట్టిన ఆందోళనకు ఇతర అగ్రశ్రేణి రెజ్లర్లు, పురుషులు, మహిళలు మద్దతు తెలిపారు.
బారతీయ జనతా పార్టీ నాయకురాలు బబితా ఫోగట్ కూడా ప్రభుత్వం నుండి కేంద్రం తెలిపిన సందేశంతో నిరసన స్థలానికి చేరుకున్నారు. ఆమె ప్రభుత్వం నుంచి వచ్చింది. మాట్లాడాక మరిన్ని వివరాలు తెలియ చేస్తామన్నారు పునియా.
బబితా ఫోగట్ మాట్లాడుతూ రెజ్లర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి సమస్యలు ఇవాళే పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
Also Read : ఎంపీ నిర్వాకం రెజ్లర్ భావోద్వేగం