Babu Mohan : హైదరాబాద్ – మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు.
అంతే కాదు ఈసారి ఎన్నికల ప్రచారంలో తాను వెళ్లడం లేదంటూ స్పష్టం చేశారు బాబు మోహన్. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేక పోవడం తలవంపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదో చెప్పాలని అన్నారు.
Babu Mohan Comment
తాను చేసిన తప్పు ఏమిటో తెలియడం లేదని వాపోయారు. పార్టీ పెద్దలు తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు బాబు మోహన్(Babu Mohan). కొందరు కావాలని తనకు, తన కొడుకు మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు.
తన వల్ల పార్టీకి పేరు వచ్చిందే తప్పా ఆ పార్టీ నుంచి తనకు ఆదరణ లభించ లేదని పేర్కొన్నారు. తాజాగా బాబు మోహన్ బీజేపీపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందని ఆశించారు. తీరా పార్టీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టడంతో విస్తు పోయారు. గతంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు.
Also Read : AP Regional Pass Port Office : ఏపీలో ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్