Babu Mohan : ‘బాబు’ బరిలో ఉంటారా
ఆందోల్ టికెట్ పై ఆందోళన
Babu Mohan : తెలంగాణ – భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో భాగంగా 119 సీట్లకు గాను మూడో విడత అభ్యర్థులను ఖరారు చేసింది. విచిత్రం ఏమిటంటే ప్రజల్లో ఎవరూ గుర్తు పట్టని వారికి టికెట్లు ఇచ్చారన్న అపవాదు మూటగట్టుకుంది. ప్రత్యేకించి జోరు మీదున్న పార్టీని ఉన్నట్టుండి బండి సంజయ్ ను తప్పించింది. కేవలం బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఇలా చేసిందన్న ప్రచారం నెలకొంది. దీనినే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
Babu Mohan Serious
ఇదిలా ఉండగా తనకు తొలి జాబితాలో టికెట్ ప్రకటించక పోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్(Babu Mohan). చివరకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నట్టుండి పార్టీ మేల్కొంది. ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు చేశాక లిస్టును ఖరారు చేశారు ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి.
ఈ మూడో జాబితాలో విచిత్రంగా బాబు మోహన్ పేరును చేర్చింది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ముందే ప్రకటించారు . సంచలనానికి తెర తీశారు. ఆయనకు టికెట్ కేటాయించడంతో పార్టీ నేతల్లో, శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంతకు బరిలో ఉంటారా లేక మౌనంగా ఉండి పోతారా అన్న దానిపై తేల్చుకోలేక పోతున్నారు.
ఈ కన్ఫ్యూజన్ ను తొలగించాల్సిన బాధ్యత పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఉందంటున్నారు. మొత్తంగా బీజేపీ తను గెలవక పోయినా కాంగ్రెస్ ను గెలిపించ కూడదనే నిర్ణయానికి వచ్చేసింది.
Also Read : Sajjala Ramakrishna Reddy : సజ్జల షాకింగ్ కామెంట్స్