Babul Supriyo : దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గాల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి.
ఇక పశ్చిమ బెంగాల్ లో ఎంపీగా ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాతో పాటు ప్రముఖ సింగర్ బాబుల్ సుప్రియో(Babul Supriyo) ఘన విజయం సాధించారు.
ఆయన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీగా రాజీనామా చేశాడు. దీంతో ఆయన స్థానంలో సిన్హా ఎంపీగా గెలుపొందారు.
ఈ సందర్భంగా భారీ విజయం సాధించిన అనంతరం బాబుల్ సుప్రియో సంచలన కామెంట్స్ చేశారు. విచిత్రం ఏమిటంటే అసన్సోల్ లోక్ సభ స్థానంలో శత్రుఘ్న సిన్హా ఏకంగా 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో భారీ గెలుపు సాధించారు.
ఈ నియోజకవర్గంలో పార్టీ మొట్టమొదటి సారిగా ఎన్నికలలో గెలుపు సాధించడం విశేషం. ఇక్కడ బీజేపీ నుంచి అగ్ని మిత్ర పాల్ పోటీ చేశారు. ఈ సందర్భంగా గెలిపించిన ప్రతి ఒక్కరికి టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలిపారు.
మరో వైపు తనపై నమ్మకం ఉంచి భారీ విజయాన్ని కట్ట బెట్టిన అసన్సోల్ ప్రజలకు, టికెట్ కేటాయించిన దీదీకి తాను థ్యాంక్స్ చెబుతున్నాని శత్రుఘ్న సిన్హా చెప్పారు.
బాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బాబుల్ సుప్రియో ఘన విజయం సాధించారు. ఇక్కడ సీపీఎం నుంచి సైరా షా హలీం తో పాటు బీజేపీ నుంచి ఘోషన్ ను రంగంలోకి దించింది.
కానీ సుప్రియో గెలుపును నిలువరించ లేక పోయారు వీరిద్దరూ. ఈ సందర్బంగా బాబుల్ సుప్రియో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా కోసం నిలబడిన , నన్ను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు ట్విట్ చేశాడు.
టీఎంసీ విజయం బీజేపీకి తగిన గుణపాఠం అని పేర్కొన్నాడు.
Also Read : రాముడి పేరుతో బీజేపీ రాజకీయం