Balineni Srinivas Reddy : జ‌గ‌న్ నాయ‌క‌త్వం శిరోధార్యం

ప‌ద‌వి కోసం ఏనాడూ పాకులాడ లేదు

Balineni Srinivas Reddy  : తాను ఎప్పుడూ ప‌ద‌వి కోసం పాకులాడ లేద‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నార‌ని, కొత్త‌గా కొలువుతీరిన కేబినెట్ లో ద‌క్క‌క పోవ‌డంపై అసంతృప్తితో ఉన్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు.

సోమ‌వారం సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy )భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కేబినెట్ కూర్పు, త‌దిత‌ర ప‌రిణామాల‌పై చ‌ర్చించారు.

అనంత‌రం త‌న‌కు చోటు ద‌క్క పోవ‌డంపై స్పందించారు. బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy )మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి తాను ఎల్ల‌ప్పుడూ వీర విధేయుడిన‌ని స్ప‌ష్టం చేశారు.

తాను రాజీనామా చేస్తున్న‌ట్లు జ‌రిగిన ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. పార్టీని న‌మ్ముకుని ఉన్నాన‌ని, ఈరోజు వ‌ర‌కు తాను అదే అంశానికి క‌ట్టుబ‌డి ఉన్నానని చెప్పారు బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి.

పార్టీ ప‌రంగా ఎన్నో వ‌త్తిళ్లు ఉంటాయ‌ని, దానిని తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని తెలిపారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ ప‌ద‌వి ఇచ్చినా ఇవ్వ‌క పోయినా బాధ‌కు గుర‌య్యే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

ప‌ద‌వుల కంటే పార్టీ త‌న‌కు ముఖ్య‌మ‌న్నారు. పార్టీ ప‌రంగా లేదా ఇంకేదైనా బాధ్య‌త అప్ప‌గించినా తాను స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి.

సామ‌ర్థ్యం ఉన్న వారినే సీఎం కేబినెట్ లోకి తీసుకున్నార‌ని అన్నారు. అయితే ఆదిమూల‌పు సురేష్ తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని పేర్కొన్నారు బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి.

Also Read : ఒక‌ప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ నేడు మినిష్ట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!