Gaddar Singer : గ‌ద్ద‌ర్ నోట రామానుజుడి పాట

మ‌నుష‌లంతా ఒక్క‌టేన‌న్న మ‌హ‌నీయుడు

Gaddar Singer  : ప్ర‌పంచం గ‌ర్వించ‌ద‌గిన ప్ర‌జా క‌ళాకారుల‌లో ఆయ‌న కూడా ఒక‌రు. విప్ల‌వం కోసం త‌న శ‌రీరంలో తూటాను భ‌రించిన అరుదైన ప్ర‌జా వాగ్గేయ‌కారుడు. జ‌నం గుండెల్లో నినాద‌మై మోగుతున్న పాట‌గాడు.

అత‌డే కోట్లాది మందిని ప్ర‌భావితం చేసిన సాంస్కృతిక యుద్ధ నౌక‌గా పిలుచుకునే గుమ్మ‌డి విఠ‌ల్ రావు అలియాస్ గ‌ద్ద‌ర్(Gaddar Singer ). 45 ఎక‌రాల సువిశాల ప్రాంగ‌ణంలో శ్రీ‌రామ‌న‌గ‌రం ఆశ్ర‌మం కొలువై ఉంది.

దీనిని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక మార్గాన్ని బోధిస్తున్నారు. స‌ర్వ ప్రాణాలు, మాన‌వులు ఒక్క‌టేన‌న్న మ‌హ‌నీయుడు శ్రీ రామానుజాచార్యుల మార్గాన్ని అనుస‌రించేలా చేస్తున్నారు.

ఆ దిశ‌గా వేలాది మంది భ‌క్తులు అడుగులు వేసేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌మున్న‌త భార‌తావ‌ని గ‌ర్వ ప‌డేలా తెలంగాణ ప్రాంతానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచేలా ఆయ‌న స‌త్ సంక‌ల్పం నెర‌వేరింది.

అదే 216 అడుగుల శ్రీ రామానుజుడి భారీ విగ్ర‌హం ఏర్పాటైంది. దీనికి 10 ఏళ్ల‌కు పైగా ప‌ట్టింది. ఆ స‌మతా మూర్తిని స‌మతా కేంద్రంగా నామ‌క‌ర‌ణం చేశారు. అంగరంగ వైభ‌వంగా మ‌హోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి.

వెయ్యేళ్ల కింద‌టే కుల‌, మ‌తాలు,వ‌ర్గ విభేదాలు ఉండ‌రాద‌ని స‌మ‌స్త మాన‌వులంతా ఒక్క‌టేన‌ని స‌మ‌తా నినాదాన్ని వినిపించిన శ్రీ రామానుజుడి గురించి గ‌ద్ద‌ర్ (Gaddar Singer )త‌న పాట‌తో అల‌రించారు.

ఆయ‌న కోసం తండోప తండాలుగా రావాల‌ని పిలుపునిస్తున్నారు. నిన్న‌టి దాకా తుపాకితో రాజ్యం సిద్దిస్తుంద‌ని పాట‌లు పాడిన ఈ విప్ల‌వ యోధుడు ఇప్పుడు భ‌క్తితోనే ముక్తి ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు.

Also Read : స‌మ‌తామూర్తి జీవితం స్ఫూర్తి పాఠం

Leave A Reply

Your Email Id will not be published!