Pak Terrorists : ఉగ్రవాద వ్యతిరేక సంకల్పాన్ని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉపా కింద ఏడుగురు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై నిషేధం విధించింది. ఇండియాను లక్ష్యంగా చేసుకున్న టెర్రర్ ఫ్యాక్టరీ(Pak Terrorists) ఇప్పటికీ పాకిస్తాన్ లో అభివృద్ధి చెందుతోందని గుర్తించింది.
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా మీటింగ్ లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షా ఆధ్వర్యంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్మూ, కాశ్మీర్ లో ఉగ్రవాద నిధులు, దాడుల కోసం చట్ట విరుద్ద కార్యకలాపాల (నివారణ) చట్టం కింద గత 15 రోజుల్లో ఏడుగురు పాకిస్తాన్ ఆధారిత టెర్రర్ కింగ్ పిన్ లను గుర్తించింది.
సీఐడీ, జె అండ్ కె పోలీసులు చేసిన సిఫారసుల మేరకు యూఏపీఏ కింద నిషేధించబడిన ఏడగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నారు. వారు సజ్జాద్ గుల్ , ఆషిక్ అహ్మద్ నెంగ్రూ, ముష్తాకక్ అహ్మద్ జర్గర్ అకా లాత్రమ్ , అర్జుమంద్ గుల్జార్ జాన్ అకా హంజా బుర్హాన్ , అలీ కాషిఫ్ జాన్ , మొహియుద్దీన్ ఔరంగజేబు అలంగీర్ , హఫీజ్ తల్హా సయీద్ ఉన్నారని గుర్తించింది కేంద్ర హోం శాఖ.
మొత్తం 38 మంది టెర్రరిస్టులపై ఎంహెచ్ఏ యూఏపీఏ కింద నిషేధం విధించింది. లోయలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా మొదలైంది. ఇతర దేశాలతో వీరిని పట్టుకునేందుకు వీలుగా చర్యలు ఉండనున్నాయి.
కాశ్మీర్ , లోతట్టు ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత వ్యతిరేక జిహాదీలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తూ వస్తోంది. దీనిని ప్రపంచానికి తెలియ చేసేందుకు భారత్ యత్నిస్తోంది.
Also Read : డీఎంసీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం