Bandaru Satyanarayana : బండారు అరెస్ట్ తో ఉద్రిక్తం
ముందస్తు బెయిల్ పిటిషన్
Bandaru Satyanarayana : విశాఖపట్నం – మాజీ మంత్రి బండారు సత్య నారాయణ చౌదరిని ఏపీ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన స్థాయిని మరిచి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేశారు. సభ్య సమాజం ప్రత్యేకించి మహిళలు తల దించుకునేలా కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandaru Satyanarayana Arrest Viral
దీంతో పార్టీలకు అతీతంగా మాజీ మంత్రి చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. బండారును అరెస్ట్ చేయడంలో ఎందుకు ఇంత ఆలస్యం చేశారంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా గుంటూరు పోలీసులు మాజీ మంత్రి బండారు సత్య నారాయణ చౌదరిని అరెస్ట్ చేశారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. ఆయనపై ఏపీ పోలీస్ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు మంత్రి రోజాను(Minister Roja) దూషించారంటూ కేసు ఫైల్ చేశారు .
కాగా ముందే అరెస్ట్ చేస్తారని ఊహించని మాజీ మంత్రి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : Revanth Reddy : కేటీఆర్ ఎన్టీఆర్ జపం చేస్తే ఎలా