Bandi Sanjay : 11న సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్
ప్రకటించిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఈనెల 11న సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్రం ప్రతి ఏటా నిర్వహించే పరీక్షల స్థాయిలోనే తెలంగాణలో పవర్ లోకి వస్తే యూపీఎస్సీ తరహా లో జాబ్ క్యాలెండర్ ముందుగానే ప్రకటిస్తామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు బండి సంజయ్.
రాష్ట్రంలో ఇప్పటి దాకా ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 2 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయని తేల్చారని, కానీ సీఎం ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. కొలువులు భర్తీ చేయాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కల్వకుంట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు.
పేపర్ లీక్ అయి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు సిట్ ఎలాంటి నివేదిక ఎందుకు సమర్పించ లేదని ప్రశ్నించారు బండి సంజయ్. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు బీజేపీ నిరుద్యోగ మార్చ్ ను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
తాము చేపట్టిన నిరుద్యోగ మార్చ్ కు నిరుద్యోగులు, ప్రజాస్వామిక వాదులు భారీ ఎత్తున తరలి రావాలని , తమ న్యాయ పరమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్(Bandi Sanjay). అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షలు మొదట భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read : కాంగ్రెస్ కు అంత సీన్ లేదు – కేటీఆర్