Bandi Sanjay KCR : సీఎం కేసీఆర్ పై భగ్గుమన్న బండి
పీఎం కార్యక్రమానికి డుమ్మా ఎందుకు
Bandi Sanjay KCR : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. శనివారం రూ. 11, 000 వేల కోట్లకు పైగా పలు అభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందుకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపించినా హాజరు కాక పోవడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆ పార్టీ చీఫ్ . దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి వస్తే రాక పోవడం ఇదేం సంస్కారం అని ప్రశ్నించారు.
ప్రధాని వస్తున్నారని తెలిసి కూడా రాక పోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు బండి సంజయ్(Bandi Sanjay KCR). ఇదే మొదటిసారి కాదని గతంలో కూడా పీఎం రాక సందర్భంగా సీఎం కావాలని రాలేదని , డుమ్మా కొట్టారంటూ ఆరోపించారు. సీఎం వ్యవహరిస్తున్న తీరుతో తమ పీఎంకు ఏం కాదని , కానీ తెలంగాణ ప్రజల పరువు తీశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం పదే పదే తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసేందుకు నిధులను కేటాయిస్తుంటే కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దక్కకుండా కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు.
పీఎం పర్యటనకు కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read : కేసీఆర్ సర్కార్ పై మోదీ సెటైర్