Bandi Sanjay : బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది.
అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి నీళ్లు, కరెంట్ కట్ చేస్తామంటూ ప్రకటించారు. దీనిపై స్పందించారు బండి సంజయ్.
ఒక రకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే భారత దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్న సైనికుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదన్నారు. బాధ్యత కలిగిన మంత్రి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం మంచిది కాదని సూచించారు.
ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమేనని స్పష్టం చేశారు బండి సంజయ్. ఆయన కశ్మీర్ ఫైల్స్ మూవీ చూశారు. అనంతరం బండి(Bandi Sanjay )మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో కొన్నేళ్లుగా కరెంట్ బిల్లులు కట్టడం లేదు.
దాని గురించి ఒక్క మాట కూడా కేటీఆర్ మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే అక్కడ కరెంట్ బిల్లులు వసూలు చేయి అని అన్నారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు బంగాళా ఖాతంలో కలపడం ఖాయమన్నారు. ఇప్పటికే జనం డిసైడ్ అయ్యారని చెప్పారు.
భూములు కబ్జా చేయడం, ఫాం హౌస్ లు కట్టు కోవాలి..నిధులు మళ్లించాలి , పేదల రక్తం తాగాలి ఇదే టీఆర్ఎస్ లక్ష్యం. ఇంతకన్నా ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు బీజేపీ చీఫ్.
Also Read : మధ్యవర్తిత్వం సమస్యలకు పరిష్కారం