Bandi Sanjay : సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై బండి సంజయ్
Bandi Sanjay Paper Leak : టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. ఆయన రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. టెక్నాజీలో తామే తోపు అంటూ ప్రగల్భాలు పలుకుతున్న కేటీఆర్ ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న వ్యవహారంపై దోషులను బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీతో పాటు 10వ తరగతి పేపర్ లీకేజీ వెనుక కల్వకుంట్ల ఫ్యామిలీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు బండి సంజయ్(Bandi Sanjay Paper Leak). ఈ మొత్తం పేపర్ లీకుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉందని, దీనికి వారే బాధ్యత వహించాలని అన్నారు. వారిపై కోర్టులో తాను తేల్చుకుంటానని అన్నారు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేశారంటూ భగ్గుమన్నారు బండి సంజయ్.
టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే 10వ తరగతి లీకేజీ డ్రామా ఆడుతున్నారంటూ మండిపడ్డారు. సీపీ నిర్వాకం అనుమానాస్పదంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ చీఫ్. తనపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేసిన మంత్రి హరీశ్ రావుపై హత్యా నేరం కేసు పెట్టాలన్నారు. ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమైన కేటీఆర్(KTR) పై పీడీ చట్టం నమోదు చేయాలన్నారు.
Also Read : బండి కామెంట్స్ పోలీస్ సంఘం సీరియస్