Bandi Sanjay : మోదీ హయాంలో జనరంజక పాలన
బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామెంట్స్
Bandi Sanjay : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశంలో జనరంజక పాలన సాగుతోందని అన్నారు భారతీయ జనతా పార్టీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేసినట్లు తెలిపారు బీజేపీ చీఫ్.
అంతే కాదు 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. 3 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. 48 కోట్ల మందికి జీరో బ్యాలెన్స్ జన్ ధన్ ఖాతాలు తెరిపించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే దక్కిందన్నారు బండి సంజయ్(Bandi Sanjay). పేదరికం నుంచి వచ్చిన ప్రధానికి కష్టాలు తెలుసు అని అందుకే మెరుగైన పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు.
గతంలో దేశాన్ని ఏలిన పాలకులు తమ స్వార్థం చేసుకున్నారని, ఆగమాగం చేశారంటూ మండిపడ్డారు. కానీ 2014లో కొలువు తీరిన మోదీ అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా చర్యలు చేపట్టారని అన్నారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఇవాళ టెక్నాలజీ పరంగా, డిజిటలైజేషన్ పరంగా టాప్ లో భారత్ ను నిలిపేసిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు బండి సంజయ్.
Also Read : YS Sharmila KCR : బీఆర్ఎస్ డేంజరస్ వైరస్ – షర్మిల