Bandi Sanjay : అధికారంలోకి వస్తం కూల్చుతం – బండి
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కామెంట్స్
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను గ్రెనేడ్లతో కూల్చి వేస్తామని ప్రకటించగా తాజాగా బండి సంజయ్(Bandi Sanjay) తానేమీ తీసిపోనంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ కోసం సచివాలయం కట్టుకున్నాడంటూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ చీఫ్.
అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే కొత్తగా సెక్రటేరియట్ ను తాజ్ మహల్ నమూనాలో కట్టారంటూ ఆరోపించారు. బీజేపీ స్ట్రీట్ కార్నర్ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించారు.
ప్రస్తుతం సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని పేర్కొన్నారు. రోడ్డు పక్కనే ఉన్న దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను కూల్చుకుంటూ పోతున్నారని దమ్ముంటే ఓల్డ్ సిటీలో అక్రమ కట్టడాలను కూల్చాలని సవాల్ విసిరారు. ఎంఐఎం , బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు బండి సంజయ్.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. 11 వేల కార్నర్ మీటింగ్స్ ను నిర్వహించి తీరుతామని చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్(Bandi Sanjay). ఈ సమావేశాలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళతామని హెచ్చరించారు. ఏమైనా ఈ కొద్ది రోజులు మాత్రమే కేసీఆర్ ఉండేదని ఆ తర్వాత శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు బండి సంజయ్. ప్రస్తుతం బండి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : ధ్వంసం చేయడం కాంగ్రెస్ విధానమా