Bandi Sanjay : ఓట్ల కోసం అంబేద్కర్ జపం – బండి
దళిత ద్రోహులే ప్రారంభిస్తే ఎలా
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే దళితులకు అన్యాయం చేశారో వారే ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. మీ వంటి చారిత్రక పురుషుడిని దళిత ద్రోహి కేసీఆర్ ప్రారంభించడం తెలంగాణను అవమానించడమేనని పేర్కొన్నారు.
మీరు రాసిన భారత రాజ్యాంగాన్ని తిరుగ రాస్తామంటూ గతంలో పలుమార్లు ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. దళితుడిని సీఎం చేస్తానని ప్రజల సాక్షిగా చెప్పిన సీఎం ఇవాళ ఓట్ల కోసం అంబేద్కర్ జపం చేస్తున్నాడని ఆరోపించారు. గత ఎనిమిదేళ్ల పాలనా కాలంలో ఏనాడూ అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదని ఆరోపించారు. దళితులను దారుణంగా మోసం చేసిన ఘనత కసీఆర్ కే దక్కుతుందని మండిపడ్డారు.
దళిత బంధు నిధులను సొంత పార్టీ కార్యకర్తలకు పప్పు బెల్లం లా పంచుతున్నారని, వీళ్లే అణగారిన వర్గాలను ఆదుకుంటామని , అభివృద్ది చేస్తున్నామని అబద్దాలు చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్(Bandi Sanjay). దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఓట్ల కోసం దళితుల జపం చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్. ఓట్ల కోసం అంబేద్కర్ చుట్టూ రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Also Read : ఎర్రకోటపై ఎగిరే జెండా మనదే – కేసీఆర్