BJP Bandi Sanjay : కల్వకుంట్ల అవినీతిని కక్కిస్తాం – బండి
బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ కుమార్
BJP Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్(BJP Bandi Sanjay) ప్రసంగించారు.
ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్ పై. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాబోయే కాలంలో రావడం ఖాయమన్నారు. వచ్చాక అక్రమంగా సంపాదించిన ఆస్తులను బయట పెడతామని, దాచుకున్న నోట్ల కట్టలను కక్కిస్తామని , అదంతా ప్రజలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత వాటి గురించే మరిచి పోయాడని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.
తాము పవర్ లోకి వచ్చిన వెంటనే మొత్తం ఖాళీలను భర్తీ చేస్తామని , కాంట్రాక్టు ఎంప్లాయిస్ కు భద్రత కల్పిస్తామని చెప్పారు. విద్యా రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఆరోగ్య రంగంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యాన్ని రూపు మాపుతామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కలిగేలా చూస్తామన్నారు.
ఇన్నేళ్ల పాలనలో ప్రజలకు ఒక్క మంచి పనైనా చేశారా సీఎం కేసీఆర్ అని నిలదీశారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరానని కానీ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు బండి సంజయ్. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. తాము వచ్చాక అంతా గాడిలో పెడతామని చెప్పారు.
Also Read : కరెంట్ కష్టం కేసీఆర్ మోసం – రేవంత్