Bandi Sanjay : డీజీపీపై బండి సీరియస్ కామెంట్స్
చేత కాక పోతే ఇంట్లో కూర్చో
Bandi Sanjay : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్ నువ్వా నేనా అంటున్నాయి. ఇక కాంగ్రెస్ ఎప్పటి లాగే ఇంటి పోరుతో సతమతం అవుతోంది.
రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ ఈడీకి కొత్త డైరెక్టర్ ను నియమించింది. ఇదిలా ఉండగా ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది.
జనగామ జిల్లా దేవరుప్పుల లో ప్రసంగిస్తుండగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందంటూ ప్రశ్నించారు. దీనిపై అక్కడే ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు మీ బీజేపీ ప్రభుత్వంలో దేశంలో ఎంత మందికి జాబ్స్ ఇచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
దీంతో కాషాయ, గులాబీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది. చివరకు ఒకరిపై మరొకరు దాడులకు దిగే పరిస్థితికి దారి తీసింది. గులాబీ శ్రేణుల దాడుల దెబ్బతో కాషాయ శ్రేణులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
వారిని చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా బండిపై కూడా దాడి చేయబోయారు. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారంటూ ఆరోపించారు సంజయ్ కుమార్(Bandi Sanjay).
తలలు పగల గొడుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ చేత కాక పోతే సీపీ ఇంట్లో కూర్చోవాలన్నారు. దాడి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడాలని లేక పోతే గాయపడిన వారితో నీ ఆఫీసు వద్దకు తీసుకు వస్తానన్నారు.
Also Read : వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్రం