Bandi Sanjay : టీటీడీ చైర్మన్ గా భూమున అనర్హుడు
భూమనకు ఎలా ఇచ్చారంటూ ప్రశ్న
Bandi Sanjay : ఏపీ సీఎం టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పాలక మండలి పదవీ కాలం పూర్తయింది. దీంతో చైర్మన్ తో పాటు సభ్యులను నియమించాల్సి ఉండగా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమనకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలో టీటీడీ చైర్మన్ గా పని చేశారు.
Bandi Sanjay Slams AP Govt
తాజాగా టీటీడీగా చైర్మన్ రెండో సారి అవకాశం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏ ప్రాతిపదికన టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారో ఏపీ సర్కార్ తెలియ చేయాలని డిమాండ్ చేశారు. అన్య మతానికి చెందిన వ్యక్తికి ఉన్నతమైన పదవి కట్టబెడితే ఎలా అని నిప్పులు చెరిగారు.
హిందూ ధర్మం పట్ల, సంస్కృతి పట్ల, నాగరికత పట్ల ఎలాంటి గౌరవం లేనటువంటి వ్యక్తికి పవిత్రమైన పుణ్య క్షేత్రంగా వినుతికెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎలా అప్పగిస్తారంటూ మండిపడ్డారు.
టీటీడీ చైర్మన్ గా ఉండేందుకు భూమన అర్హుడు కాడన్నారు. ఆయన కూతురు వివాహాన్ని ఏ మత సంప్రదాయం ప్రకారం చేశారో చెప్పాలన్నారు బండి సంజయ్ కుమార్. తన అఫిడవిట్ లో ఏ మతానికి చెందిన వారో పూర్తిగా తెలియ చేశారని పేర్కొన్నారు.
Also Read : RK Roja Selvamani : విద్యా పరంగా ఏపీ నెంబర్ వన్
