Bandi Sanjay : మహా జన్ సంపర్క్ యాన్ రద్దు – బండి
రైలు ప్రమాదం సందర్బంగా వాయిదా
Bandi Sanjay : తెలంగాణ రాష్ట్రంలో శనివారం తలపెట్టిన మహా జన్ సంపర్క్ యాన్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు భారతీయ జనతా పార్టీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) . ట్విట్టర్ వేదికగా ఇవాళ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ హైకమాండ్ చేసిన సూచనల మేరకు ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ లో శుక్రవారం రాత్రి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ఘటనలో 988 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చని పోయిన వారికి సంతాప సూచకంగా తాము ఇవాళ తలపెట్టిన మహా జన్ సంపర్క్ యాన్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు.
రైలు ఘటనలో చని పోయిన వారికి సంతాప సూచకంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ శ్రేణులు నివాళులు అర్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. కేంద్రం ఇప్పటికే సహాయం ప్రకటించిందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాదంలో చని పోయిన వారికి నివాళులు అర్పించారని పేర్కొన్నారు.
అంతే కాకుండా ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు , తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రూ. 50, 000 సహాయం ప్రకటించారని బీజేపీ చీఫ్ వెల్లడించారు. అంతే కాకుండా ప్రమాద స్థలంలో రెస్క్యూ టీంలు సహాయక చర్యలలో నిమగ్నం అయ్యాయని, కేంద్రం నుంచి కూడా అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా ఎలా జరిగిందనే దానిపై కేంద్ర రైల్వే శాఖ విచారణకు ఆదేశిచిందని స్పష్టం చేశారు బండి సంజయ్.
Also Read : MLC Kavitha Himanshu