Indira Gandhi Tiger Reserve : టైగర్ ప్రాజెక్టు ఆమె పుణ్యమే
ఇందిరా గాంధీ ఫోటో వైరల్
Indira Gandhi Tiger Reserve : ఇందిరా గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దేశానికి ప్రధానిగా ఎన్నో సేవలు అందించారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించిన నాయకురాలిగా నిలిచి పోయారు. తను సిక్కుల ఆగ్రహానికి గురయ్యారు. అంగరక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
ఇదే సమయంలో తనయుడు రాజీవ్ గాంధీ కూడా ఎల్టీటీఈ దాడుల్లో ముక్కలు ముక్కలయ్యారు. ఇటీవలే ఈ కేసులో శిక్ష పడిన వారికి బెయిల్ లభించింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం ఇందిరా గాంధీ చర్చనీయాంశంగా మారారు. ఎందుకంటే ఆదివారం కర్ణాటక లోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును(Indira Gandhi Tiger Reserve) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. దీనిని ఏర్పాటు చేసి 50 ఏళ్లవుతోంది. ఈ సందర్బంగా మోదీ టైగర్ రిజర్వ్ లోకి వెళ్లారు. 20 కిలోమీటర్ల మేర ఆయన జంగిల్ సఫారీ చేశారు. ఫోటోలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.
దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక సీనియర్ నాయకురాలు భవ్య నరసింహ్మమూర్తి స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రచారం కోసమే మోదీ ఇలా చేశారని, కానీ ధైర్యంగా తమ నాయకురాలు పులితో దిగారంటూ పేర్కొన్నారు. దేనికైనా ధైర్యం, దమ్ము ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఇందిర ఫోటో హల్ చల్ చేస్తోంది నెట్టింట్లో.
Also Read : నిధుల కోసం కోటి లేఖల ప్రచారం