S Gurumurthy : నోరు పారేసుకున్న ఆర్బీఐ మెంబర్
గురుమూర్తి కామెంట్స్ పై బ్యాంకు ఉద్యోగుల ఫైర్
S Gurumurthy : ఆయన బాధ్యత కలిగిన అత్యున్నత ఆర్థిక సంస్థలో బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఏదైనా మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. కానీ మతి తప్పి సోయి లేకుండా నోరు పారేసుకుంటే ఎలా. ఇదే జరిగింది.
దేశ వ్యాప్తంగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న సెక్టార్ లో బ్యాంకింగ్ రంగం కూడా ఒకటి. ఇప్పటికే కేంద్రంలోని మోదీ సర్కార్ గంప గుత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది.
మరి బీజేపీకి అనుంగు సంస్థగా పేరొందిన ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి ఈ గురుమూర్తి(S Gurumurthy). ఆయనను ఏరికోరి బీజేపీ పరివారం దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశానికి సేఫ్ గార్డ్ గా పరిగణించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మెంబర్ గా నియమించింది.
ఇంకేం కేంద్రంలో పవర్ తమదే అనుకున్నారేమో బ్యాంకు ఉద్యోగులపై నోరు పారేసుకున్నారు. వారిని అనరాని మాటలు అన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్తగా పేరొందారు.
ఇదే భావజాలం ఇక్కడ కూడా పనికి వస్తుందేమోనని అనుకున్నారేమో వారంతా పనికిరాని వారంటూ కామెంట్ చేశాడు. ప్రతిభ కలిగిన వారంతా ప్రైవేట్ బ్యాంకులు, కంపెనీలు, సంస్థల్లోకి వెళ్లి పోతే మిగతా చెత్త సరుకు అంతా ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుల్లో పని చేస్తోందంటూ కామెంట్ చేశారు.
దాంతో గురుమూర్తివెంటనే ఆర్బీఐ మెంబర్ గా ఉండేందుకు వీలు లేదని , తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు
ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా గురుమూర్తి(S Gurumurthy) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ సిద్దాంతకర్తకు ఆర్బీఐతో ఏం పని ఉందోనని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read : కేరళపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్