Basavaraj Bommai : కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ , బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మధ్య హిందీ భాషా వివాదంపై ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో కర్నాటకకు చెందిన మాజీ సీఎంలు సిద్దరామయ్య, కుమార స్వామి ఫైర్ అయ్యారు.
హిందీ జాతీయ భాష కావచ్చు కానీ తమ రాష్ట్రానికి సంబంధించి కన్నడ భాషే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) సంచలన ప్రకటన చేశారు. కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్టేనని పేర్కొన్నారు.
హిందీ భాషా వివాదం కన్నడ నాట కలకలం రేపింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని , ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని స్పష్టం చేశారు. కిచ్చా సుదీప్ మాటలు సరైనవేనని, దానిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని గౌరవించాలని సూచించారు.
దక్షిణాది సినిమాలు బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని , హిందీ లోకి డబ్ అయి బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు కావడం విశేషం. ఇక పై హిందీ జాతీయ భాషగా ఉండబోదంటూ స్పష్టం చేశారు కిచ్చా సుదీప్.
కిచ్చా చేసిన వ్యాఖ్యలకు తాను సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నానంటూ ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai). ఇదిలా ఉండగా దిగ్గజ సినీ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు.
దక్షిణాది సినిమాలు సాధిస్తున్న విజయాలను చూసి బాలీవుడ్ స్టార్స్ ఇన్ సెక్యూర్ గా ఫీలవుతున్నారంటూ పేర్కొన్నారు. ఆర్జీవీ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.
Also Read : కళాకారులకు ఇదా మీరిచ్చే గౌరవం