BBC Says No Fear : ప్రజా గొంతుకను వినిపిస్తాం – బీబీసీ
స్పష్టం చేసిన బీబీసీ యాజమాన్యం
BBC Says No Fear : మోదీ ది క్వశ్చన్ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ కలకలం రేపింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తు పోయేలా చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గుజరాత్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో 2002లో చోటు చేసుకున్న అల్లర్లు, దారుణాల గురించి ప్రశ్నించింది. ప్రత్యేకంగా ప్రస్తావించింది. బాధితుల గొంతును వెలికి తీసే ప్రయత్నం చేసింది. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీని నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.
ఆపై దానికి సంబంధించిన లింకులను నిలిపి వేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంత లోపే యావత్ ప్రపంచమంతా దానిని వీక్షించింది. ఇదే సమయంలో బీబీసీపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఒకటి వ్యతిరేకంగా మరొకటి అనుకూలంగా. ఈ మొత్తం పిటిషన్లపై భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. బీబీసీ ప్రసారం చేసిన మోదీ ది క్వశ్చన్ కారణంగా ఎంత మంది ప్రభావితం అవుతారో చెప్పగలరా అని ప్రశ్నించింది.
ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ లను, రికార్డులను తమకు సమర్పించాలని ఆదేశించింది. ఈ తరుణంలో గత మూడు రోజులుగా కేంద్ర ఐటీ శాఖ బీబీసీ ఆఫీసులపై దాడులు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా బీబీసీ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తాము ఎవరి పక్షం కాదని ప్రజా పక్షమే ఉంటామని స్పష్టం(BBC Says No Fear) చేసింది. ఎప్పటి లాగే తాము ప్రజా వాయిస్ ను వినిపిస్తామని తెలిపింది.
Also Read : మోదీ వ్యూహం చైనా దిగ్బంధం