IPL Fans : ఐపీఎల్ ఫ్యాన్స్ కు ఖుష్ ఖ‌బ‌ర్ – దాదా

ఫ్లే ఆఫ్స్ , ఫైన‌ల్ మ్యాచ్ కు 100 శాతం ప‌ర్మిష‌న్

IPL Fans : క‌రోనా పేరుతో నానా ఇబ్బందు ప‌డిన క్రికెట్ ల‌వ‌ర్స్, ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి ( బీసీసీఐ). ఈ మేర‌కు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కీల‌క స‌మావేశం జ‌రిగింది.

ఇందులో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ 2022( IPL Fans) టోర్నీలో 35 లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. మొత్తం 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి.

ఇంకా స‌గం మ్యాచ్ లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహించ‌ని రీతిలో జ‌ట్లు కొలువు తీరాయి. ఎవ‌రు ప్లే ఆఫ్స్ కు చేరుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

గ‌తంలో డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ గా ఉన్న చెన్నై, ముంబై ఇంకా మ‌ల్ల గుల్లాలు ప‌డుతున్నాయి. గ‌త సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో పాటు కొత్త‌గా వ‌చ్చిన గుజ‌రాత్ టైటాన్స్ ఊహించ‌ని రీతిలో స‌త్తా చాటుతున్నాయి.

హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ జైత్రయాత్ర కొన‌సాగిస్తోంది. ఇక హైద‌రాబాద్ బౌలింగ్ ప‌రంగా దుమ్ము రేపుతోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈసారి బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా అధిక ఆదాయం స‌మ‌కూరుతోంది.

దీంతో ఫ్యాన్స్ ను మ్యాచ్ లు చూసేందుకు కొద్ది మందికి మాత్ర‌మే చాన్స్ ఇచ్చింది. కానీ ఈసారి కోల్ క‌తా వేదిక‌గా నిర్వ‌హించే క్వాలిఫ‌య‌ర్ -1 మ్యాచ్ కు, క్వాలిఫ‌య‌ర్ 2 , ఫైన‌ల్ మ్యాచ్ నిర్వ‌హించే అహ్మ‌దాబాద్ స్టేడియంలో 100 శాతం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బీసీసీఐ చీఫ్ గంగూలీ. సో ఫ్యాన్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పాడు దాదా.

Also Read : హైద‌రాబాద్ దెబ్బ బెంగ‌ళూరు అబ్బా

Leave A Reply

Your Email Id will not be published!