BCCI Comment : బీసీసీఐ నిర్వాకం భారత్ కు శాపం
అసలు భారత జట్టుకు ఏమైంది
BCCI Comment : ప్రపంచ క్రికెట్ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ కలిగి ఉంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). క్రికెట్ వ్యవహారాలు, షెడ్యూల్, ఆటగాళ్ల జీతాలతో పాటు దేశంలో క్రికెట్ ను అభివృద్ది చేసేందుకు మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు కీలకమైన పనులు చేపడుతుంది.
భారత దేశంలో ప్రభుత్వానికి లేనంతటి ఆదరణ, పవర్స్ బీసీసీఐ(BCCI) కి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకైక సంస్థ. ఇతర
క్రీడా సంస్థలు దేశంలో ఎన్నో ఉన్నా బీసీసీఐపై మాత్రం ఇంకా సర్కార్ సాధికారత సాధించలేదు.
రాజకీయాలకు, వర్గ పోరాటాలకు, వివాదాలకు గత కొంత కాలంగా నిలుస్తూ వచ్చింది. ప్రధానంగా ఆటగాళ్ల ఎంపికలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
1983 వరకు ఒక ఎత్తు. ఆ తర్వాత ఒక ఎత్తు. ఎప్పుడైతే హర్యానా కరేన్ కపిల్ దేవ్ నిఖంజ్ వరల్డ్ కప్ తెచ్చాడో ఆనాటి నుంచి భారత దేశంలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా క్రికెట్. ఒక వ్యాపకంగా జీవితంలో ఒక భాగమై పోయింది. ప్రపంచలోనే అత్యధిక ఆదాయం కలిగిన సంస్థగా ఇప్పటికే టాప్ లో నిలిచింది బీసీసీఐ.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనేది ఉన్నా అది పేరుకు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపార,
వాణిజ్య వేత్తల కళ్లన్నీ భారత్ పైనే.
క్రికెటను నియంత్రించే సంస్థ బీసీసీఐతో(BCCI Comment) సంబంధాలు నెరుపుతూ వస్తన్నారు. ప్రసార హక్కుల విషయంలో వేల కోట్లను దక్కించుకుంది సదరు సంస్థ. ప్రధానంగా అత్యధిక ఆదాయ వనరుగా ఉంది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ).
ఏ ముహూర్తాన లలిత్ మోడీ ప్రారంభించాడో ఆనాటి నుంచి అది దినదినం ప్రవర్దమానమై కోట్లను కొల్లగొడుతోంది. మెరుగైన ఆటగాళ్లకు అది వేదికగా మారింది.
దాని ఆధారంగా ఇప్పుడు బీసీసీఐ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో పడింది. ఇక ఐపీఎల్(IPL) దెబ్బకు ఇతర దేశాలు లబోదిబోమంటున్నాయి.
ప్రస్తుతం బీసీసీఐ ఆట కంటే కాసులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా భారత జట్టు ఎంపిక విషయంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా కొంత మందికే, కొన్ని ప్రాంతాలకు ప్రయారిటీ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా యూఏఈ వేదికపై జరుగుతున్న ఆసియా కప్ లో భారత జట్టు శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది.
దిగ్గజ ఆటగాళ్లున్నా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఇంటి బాట పట్టింది. దీంతో కప్ మాటేమిటో కానీ వచ్చే టి20 వరల్డ్ కప్ లో కనీస ప్రదర్శన చేస్తారా
అన్న అనుమానం నెలకొంది.
బీసీసీఐ బాస్ గంగూలీ(Saurav Ganguly), కార్యదర్శి జే షా తో పాటు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ, హెడ్ కోచ్ ద్రవిడ్ జట్టు ఎంపికలో ఆలోచించాలి. ఆడే ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వాలి.
జట్టుకు స్వేచ్ఛ ఇవ్వాలి. పదే పదే కెప్టెన్లను మార్చకుండా జట్టు పటిష్టతపై దృష్టి పెట్టాలి. లేక పోతే బీసీసీఐ అపవాదు మూటగట్టుకోక తప్పదు.
Also Read : హిజాబ్ వివాదంపై కోర్టు కామెంట్స్