Sanju Samson : శాంస‌న్ క‌థ కంచికేనా

తీరు మార్చుకోని బీసీసీఐ

Sanju Samson : ముంబై – బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ మారినా ఆట‌గాళ్ల ఎంపిక తీరులో ఎలాంటి మార్పులు రావ‌డం లేదు. ప్ర‌త్యేకించి ముంబై లాబీయింగ్ ఎక్కువ‌గా ప‌ని చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. చైర్మ‌న్ తో పాటు కెప్టెన్ కూడా ముంబైకి చెందిన వ్య‌క్తులే ఉండ‌డం ఇత‌ర ఆటగాళ్ల పాలిట శాపంగా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Sanju Samson Hold Viral

వ‌న్డే ఫార్మాట్ లో ఎలాంటి అనుభ‌వం లేని సూర్య కుమార్ యాద‌వ్ ను , గాయ‌ప‌డి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్న కేఎల్ రాహుల్ ను ఏ ప్రాతిప‌దిక‌న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టుకు సెలెక్ష‌న్ చేశార‌నేది ఇప్ప‌టికీ అంతు ప‌ట్ట‌ని విధంగా మారింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా బీసీసీఐ తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్(Sanju Samson) ప‌ట్ల అనుస‌రిస్తున్న తీరు పూర్తిగా క‌క్ష సాధింపు ధోర‌ణిగా ఉందే త‌ప్ప ప్రోత్స‌హించేలా లేదంటున్నారు.

15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. చాహ‌ల్ , శాంస‌న్ , తిల‌క్ వ‌ర్మ‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్ లు ఎంపిక చేస్తార‌ని భావించారంతా. కానీ వారంద‌రినీ ప‌క్క‌న పెట్టింది. ఇక‌నైనా స‌మ‌యం మించి పోలేద‌ని, త‌మ త‌ప్పు తెలుసుకుని శాంస‌న్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను ఎంపిక చేయాల‌ని లేదా స్టాండ్ బై కోస‌మైనా ప‌రిశీలిస్తే బావుంటుంద‌ని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.

Also Read : PM Modi : మాన‌వ సాధికార‌త ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!