Hardik Pandya : పాండ్యా స‌త్తా చాటాడు ఎంపిక‌య్యాడు

హార్దిక్ పాండ్యాకు అరుదైన చాన్స్

Hardik Pandya : ఈ ఏడాది 2022 బాగా క‌లిసొచ్చిన ఆట‌గాడు ఎవ‌రైనా ఉన్నారంటే అది ఐపీఎల్ లో కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ గా ఉన్న హార్దిక్ పాండ్యానేని చెప్ప‌క త‌ప్ప‌దు.

గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో పేల‌వ‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకోని పాండ్యా జాతీయ జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. గాయం కూడా తోడ‌వ‌డంతో కొద్ది కాలం పాటు ఆట‌కు దూర‌మ‌య్యాడు కూడా.

ఇక ఆట‌కు స్వ‌స్తి చెబుతాడేమోన‌న్న ప్ర‌చారం జ‌రిగింది. కానీ వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ ఊహించ‌ని రీతిలో గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం ఏకంగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసుకుంది.

అత‌డికే సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో క్రికెట్ వ‌ర్గాలే కాదు తాజా, మాజీ ఆట‌గాళ్లు సైతం విస్తు పోయారు.

ఫామ్ లో లేని క్రికెట‌ర్ ను తీసుకు వ‌చ్చి భారీ ధ‌ర చెల్లించి మ‌రీ కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఏంటి అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దెబ్బ తిన్న పులిలా రాణించాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). ఆ జ‌ట్టును ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో స‌త్తా చాటాడు.

తాను ఆడుతూ ఇత‌ర ఆటగాళ్లు ఆడేలా కెప్టెన్సీ చేశాడు. మొత్తం ఐపీఎల్ లీగ్ లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ప్లేయ‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యానే(Hardik Pandya). గుజ‌రాత్ టైటాన్స్ మొత్తం 14 మ్యాచ్ లు ఆడింది.

ఇందులో 10 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి నాలుగు గేమ్ ల‌లో ఓడి పోయింది. 20 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది.

దీంతో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యాకు స్వదేశంలో జ‌రిగే టీ20 సీరీస్ జ‌ట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ.

Also Read : దాదా బంగ్లా ఖ‌రీదు మామూలు లేదుగా

Leave A Reply

Your Email Id will not be published!