BCCI Test Squad : కొత్తోళ్లకు ఛాన్స్ శాంసన్ ‘మిస్’
మరోసారి బీసీసీఐ మొండి చేయి
BCCI Test Squad : అంతా అనుకున్నట్టుగానే అభిమన్యు ఈశ్వరన్ కు బీసీసీఐ ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటికే దేశీవాళి క్రికెట్ లో సత్తా చాటుతున్న అభిమన్యుకు ఊహించని రీతిలో బంగ్లాదేశ్ తో జరిగే మొదటి టెస్టుకు ఎంపిక చేసింది. రాహుల్ ద్రవిడ్ ఏరికోరి మనోడిని ఎంపిక చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా ఇప్పటికే మూడు వన్డేల సీరీస్ ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో గెలుపొందింది. మొదటి, రెండో వన్డేల్లో సత్తా చాటింది బంగ్లా. మూడో వన్డేలో టీమిండియా భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా బంగ్లాదేశ్ తో జరగబోయే మొదటి టెస్టు మ్యాచ్ కు కీలక మార్పులు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)(BCCI Test Squad).
డిసెంబర్ 14న ప్రారంభం కానుంది టెస్టు మ్యాచ్. ఇందుకు గాను 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తీవ్ర గాయం కారణంగా వైదొలిగిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కు ఛాన్స్ ఇచ్చింది. ఇక షమీ, రవీంద్ర జడేజాల ప్లేస్ లో నవదీప్ షైనీ, సౌరభ్ కుమార్ లను ఎంపిక చేసింది.
ఎప్పటి లాగే సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్ కు అప్పగించింది. తొలి టెస్టు 14 నుంచి 18 వరకు జరగనుండగా, రెండో టెస్టు 22 నుంచి 26 వరకు కొనసాగుతుంది.
జట్టు పరంగా చూస్తే కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా పుజారా వైస్ కెప్టెన్ , కోహ్లీ, అయ్యర్ , పంత్ (వికెట్ కీపర్ ) , కేఎస్ భరత్, అశ్విన్ , అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , సిరాజ్ , ఉమేష్ యాదవ్ , ఠాకూర్ , అభిమన్యు ఈశ్వరన్ , నవదీప్ షైనీ , సౌరభ్ కుమార్ , జయదేవ్ ఉనాద్కత్ ఉన్నారు.
Also Read : అభిమన్యు ఈశ్వరన్ కు టెస్టు ఛాన్స్