Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడాన్ని ఆయన ఎత్తి చూపారు. గతంలోనే మోదీ (Modi) ఎన్నికల కోసం ఆగారని ఫలితాలు వచ్చాక పెంచడం ఖాయమన్నారు.
ఇవాళ తాను చెప్పినట్లుగానే చమురు, గ్యాస్ కంపెనీలు ధరల మోత మోగిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇప్పుడు ఓట్లు వేసిన పాపానికి, గెలిపించినందుకు ప్రజలు కేంద్ర సర్కార్ కు ,
చెవుల్లో పూలు పెట్టి ఓట్లు కొల్లగొట్టిన మోదీకి చప్పట్లు కొట్టండని పేర్కొన్నారు రాహుల్ గాంధీ (Rahul Gandhi) . ఆయన ట్విట్టర్ వేదికగా మోదీపై ఫైర్ అయ్యారు. ఆయిల్, గ్యాస్ ధరలు పెంచడంపై తీవ్రంగా మండిపడ్డారు.
పెట్రోల్, గ్యాస్, డీజిల్ పై మోదీ (Modi) లాక్ డౌన్ ఎత్తేశారంటూ సీరియస్ అయ్యారు. కరోనా సమయంలో ఆయన ఏం చెప్పారో అదే చేశారంటూ ఎద్దేవా చేశారు. 137 రోజుల తర్వాత ధరలు పెంచారు.
అంతకు ముందు ఎన్నికలు ఉండడంతో చాలా తెలివిగా కేంద్ర సర్కార్ వాటిని నియంత్రించింది. కానీ ఎన్నికలై పోయాక మళ్లీ ధరల మోత మోగించడం స్టార్ట్ చేసింది.
ఈ విషయాన్ని ముందే గుర్తించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ఎప్పుడో హెచ్చరించారు. ఆయన దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని లేవనెత్తుతున్నారు.
కానీ జనం పట్టించు కోలేదు. కులం, ప్రాంతం, మతం పేరుతో ఓట్లు చీల్చుతున్న బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎండగడుతూ వస్తున్నారు.
కానీ ఫాయిదా లేకుండా పోయింది. ఇదిలా ఉండగా మరో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) కూడా మోదీ (Modi) సర్కార్ పై మండిపడ్డారు.
Also Read : ఎంపీ పదవికి అఖిలేష్ రాజీనామా