Eknath Shinde : జ్యోతిష్యాన్ని కాదు కష్టాన్ని నమ్ముకున్నా
మరాఠా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కామెంట్స్
Eknath Shinde : మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడితేనే సుఖం ఉంటుందన్నారు. తనకు ఎవరి సహాయం అక్కర్లేదన్నారు. ఒకనాడు ఆటో రిక్షా నడిపాను. ఇవాళ ముఖ్యమంత్రి(Eknath Shinde) పీఠం మీద కూర్చున్నా. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుందని, జ్యోతిష్యుల వద్ద ఉండదన్నాడు షిండే.
తనకు వాటి మీద నమ్మకం లేదన్నాడు. తాను కష్టాన్ని నమ్ముకున్నానని అదే తనను రక్షిస్తోందని చెప్పారు. ఎవరి అభిప్రాయాలు, నమ్మకాలు వారికి ఉంటాయని, అలా ఉండడంలో తప్పు లేదన్నారు. ఇదిలా ఉండగా తాను షిర్డీ, నాసిక్ లను సందర్శించిన సమయంలో ఒక జ్యోతిష్యుడిని కలిశానంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై సీరియస్ గా స్పందించారు షిండే.
అలా తనను విమర్శించిన వారే ఎంత మంది జ్యోతిష్యులను కలుస్తున్నారో వారి ఆత్మలకు తెలుసని ఎద్దేవా చేశారు. తాను చేతిలో ఉన్న రేఖలను నమ్ముకున్నానని కానీ జ్యోతిష్యాన్ని కాదని మరోసారి కుండ బద్దలు కొట్టారు సీఎం(Eknath Shinde). నా అర చేతిని ఏ జ్యోతిష్కుడికి చూపించాల్సిన అవసరం లేదన్నారు.
తన భవిష్యత్తును మార్చుకునేందుకు తన మణికట్టుకు తగినంత బలం ఉందన్నారు ఏక్ నాథ్ షిండే. అర చేతిపై ఉన్న గీతలను మార్చేందుకు మణికట్టులో బలం ఉండాలన్నారు. ఆ బలాన్ని బాలా సాహెబ్ ఠాక్రే , ఆనంద్ ఢిఘే తనకు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే చేసిన కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా గవర్నర్ కోష్యారి శివాజీ చేసిన కామెంట్స్ తో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు.
Also Read : మహిళలు దుస్తులు లేకున్నా బాగుంటారు