Nandini Chakraborty : బీజేపీ టార్గెట్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ ఫర్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ నుంచి బదిలీ
Nandini Chakraborty : భారతీయ జనతా పార్టీ గత కొంత కాలం నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నందిని చక్రవర్తిపై ఎట్టకేలకు వేటు పడింది. ఆమె బెంగాల్ గవర్నర్ కార్యాలయంలో ఉన్నతాధికారిగా ఉన్నారు.
బీజేపీ పట్ల వ్యతిరేకతను కలిగి ఉందని, ఇదే సమయంలో ఆమె సీఎం మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. నందిని చక్రవర్తిని పదే పదే లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలుకు దిగింది కాషాయ పార్టీ.
ఎట్టకేలకు ఆమెను గురువారం బదిలీ చేసింది. ఈ మేరకు రాజ్ భవన్ ట్రాన్స్ ఫర్ చేయాలంటూ కోరింది. చివరకు రాష్ట్ర సర్కార్ రాజ్ భవన్ కోరికను మన్నించింది. ఆమెను వెంటనే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నందిని చక్రవర్తిని(Nandini Chakraborty) గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని పర్యాటక శాఖకు ట్రాన్స్ ఫర్ చేసింది.
బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన వ్యవహారాలను నిర్వహించేందుకు రాజ్ భవన్ లో కొత్త టీంను ఏర్పాటు చేయనున్నారు. ఆ దిశలో మొదటి చర్యగా ఇప్పటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ (ముఖ్య కార్యదర్శి) గా ఉన్న నందిని చక్రవర్తిని సాగనంపారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు నందిని చక్రవర్తిని పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఈ మేరకు బుధవారం సాయంత్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1994 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నందిని చక్రవర్తిని బదిలీ చేయడం పట్ల గవర్నర్ సంతోషంగా ఉన్నారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా నడుచు కుంటోందని ఆరోపించారు ఎమ్మెల్యే.
Also Read : విష పూరిత ప్రచారం ప్రమాదకరం