PM Modi : అభివృద్ది నిరోధ‌కుల ప‌ట్ల జాగ్ర‌త్త – మోదీ

మొద‌టిసారిగా అర్బ‌న్ న‌క్స‌ల్స్ పై కామెంట్

PM Modi :  దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మొద‌టిసారిగా అర్బ‌న్ న‌క్స‌ల్స్ అన్న ప‌దాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

వీరు ఇప్ప‌టికీ చురుకుగా ఉన్నారు. వ్యాపారాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డం లేదా మ‌రింత సౌక‌ర్య‌వంతంగా జీవించ‌డం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు ప‌ర్యావ‌ర‌ణం పేరుతో నిలిచి పోకుండా చూడాల‌న్నారు.

దీని పేరుతో జ‌రిగే కుట్ర‌ల‌ను ముందుగా గుర్తించి స‌మ‌తుల్య‌త పాటించేలా కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. అర్బ‌న్ న‌క్స‌ల్స్ ప‌ట్ల అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయా రాష్ట్రాల ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రులకు ప్ర‌ధాన మంత్రి మోదీ(PM Modi) సూచించారు.

ఇవాళ దేశంలోని మంత్రుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు పీఎం. గుజ‌రాత్ లోని న‌ర్మ‌దా న‌దిపై స‌ర్దార్ స‌రోవ‌ర్ డ్యామ్ నిర్మాణాన్ని రాజ‌కీయ అండ‌దండ‌ల‌తో అర్బ‌న్ న‌క్స‌ల్స్ , అభివృద్ధి నిరోధ‌కులు ఎన్నో ఏళ్లుగా అడ్డుకున్నార‌ని , అది ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగిస్తుంద‌న్నారు మోదీ.

వాళ్లంతా ప్రాజెక్టు నిర్మిస్తే ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంద‌ని ప్ర‌చారం చేశారు. వీరి నిర్వాకం వ‌ల్ల ఇవాళ అది పూర్తికాకుండా పోయింద‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణం పేరుతో ఇలాంటి ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.

అలాంటి వారిని ఉక్కు పాదంతో అణిచి వేయాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ది జ‌ర‌గాలంటే ర‌హ‌దారులు, ప్రాజెక్టుల నిర్మాణం జ‌ర‌గాల్సిందేన‌న్నారు.

ప‌రిశ్ర‌మ‌లు రావాలంటే వ్యాపార‌వేత్త‌ల స‌హ‌కారం కావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi).
పెద్ద ఎత్తున ఖ‌ర్చు జ‌రిగింది. డ్యామ్ పూర్త‌యింది. వారి వాద‌న‌లు, ప్ర‌చారాల‌న్నీ అబ‌ద్దాలేన‌ని తేలి పోయింద‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

Also Read : కుటుంబ పార్టీల‌పై బీజేపీ పోరాటం – జేపీ న‌డ్డా

Leave A Reply

Your Email Id will not be published!