VC Sajjanar MD RTC : ఆర్టీసీ ఎండీకి భద్రాద్రి తలంబ్రాలు
10వ తేదీ వరకు హోం డెలివరీ పొడిగింపు
VC Sajjanar MD RTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. సంస్థ ప్రస్తుతం నష్టాలలో కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ కొలువు తీరాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను తిరుమలకు నేరుగా అన్ని డిపోల నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.
అంతే కాదు ఎలాంటి రిస్క్ లేకుండా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సులలో ప్రయాణం చేసినట్లయితే టికెట్ తో పాటు తిరుమల దర్శనం, వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరో వైపు ఊహించని రీతిలో ఆర్టీసీలో కార్గో సర్వీస్ ను ఏర్పాటు చేశారు వీసీ సజ్జనార్(VC Sajjanar MD RTC). అది లాభాల బాటలో నడుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ద దేవాలయాలు, పుణ్య క్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. తాజాగా భద్రాచలంలో కొలువు తీరిన సీతారాముల కళ్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను బుక్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కల్పిస్తోంది. కళ్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది.
ఇప్పటి వరకు లక్ష మందికి పైగా తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు అందజేసింది. సోమవారం ఎండీ తలంబ్రాలను స్వీకరించారు. ఏప్రిల్ 10 వరకు బుకింగ్ చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు ఎండీ. బుకింగ్ కోసం 9177683134, 7382924900, 9154680020 ఆయా ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
Also Read : భద్రాద్రి సీతారాముల తలంబ్రాలకు ఫుల్ డిమాండ్..