BC Nagesh : ఇక క‌న్న‌డ నాట భ‌గ‌వ‌ద్గీత

నిపుణులు ఓకే అంటే సై

BC Nagesh : క‌ర్ణాట‌క విద్యా శాఖ మంత్రి న‌గేశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఆర‌వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు పాఠ్యాంశంగా భ‌గ‌వద్గీత‌ను ఏర్పాటు చేసింది.

దీనిని మంత్రి స్వాగ‌తించారు. భ‌గ‌వ‌ద్గీత అన్న‌ది జీవ‌న సార‌మ‌ని, అది స‌మ‌స్త మాన‌వాళికి అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయులే కాదు ప్ర‌తి ఒక్క‌రు భ‌గ‌వ‌ద్గీత‌ను ఆద‌ర్శ ప్రాయంగా తీసుకుంటున్నార‌ని ఎంద‌రో నేటికీ దానిని దైవంగా కొలుస్తున్నార‌ని తెలిపారు.

ఒక్క హిందువుల‌దే అనుకుంటే పొర‌పాటు అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిపుణులంద‌రితో స‌మావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు న‌గేశ్(BC Nagesh).

దీనిని రాష్ట్రంలోని స్కూల్ సిల‌బ‌స్ లో ప్రవేశ పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీకి చెందిన ప్ర‌భుత్వం రాజ‌స్థాన్ లో తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు స్వాగ‌తిస్తున్నార‌ని తెలిపారు.

జీవితంలో ఎదుర‌య్యే స‌వాళ్లు, స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు, దాటేందుకు భ‌గ‌వ‌ద్గీత ఒక దారి చూపిస్తుంద‌న్నారు న‌గేశ్(BC Nagesh). విద్యా వేత్త‌లు ఓకే అంటే వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి తాము ప్ర‌వేశ పెట్టేందుకు సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు.

ఈ విష‌యాన్ని సీఎంతో కూడా చ‌ర్చిస్తామ‌న్నారు. నైతిక విద్య అన్న‌ది విద్యార్థుల‌కు అత్యంత అవ‌స‌ర‌మ‌ని మ‌రోసారి నొక్కి వ‌క్కానించారు మంత్రి.

ప్ర‌స్తుతం విద్యార్థులు నైతిక విలువ ప‌ట్ల దృష్టి సారించడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క విద్యార్థికి భ‌గ‌వ‌ద్గీత అన్న‌ది పాఠంగా రావాల‌ని సూచించారు.

Also Read : కాంగ్రెస్ శాశ్వ‌తం బీజేపీ అశాశ్వ‌తం

Leave A Reply

Your Email Id will not be published!