Sidhu : పంజాబ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. డైనమిక్ లీడర్ అంటూ కొనియాడారు.
అంతే కాదు ఎలాంటి అహంకారం లేని సీఎం అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా సీఎం మాన్ తో సిద్దూ (Sidhu )భేటీ అయ్యారు. వీరిద్దరూ 50 నిమిషాల పాటు మాట్లాడారు. వివిధ అంశాలపై చర్చించారు.
సిద్దూ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ , అకాలీదళ్ నేతలపై విరుచుకు పడ్డారు. గతంలో పని చేసిన సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రజలకు సమయం కేటాయించ లేక పోయారని ధ్వజమెత్తారు.
కానీ భగవంత్ మాన్ ఎలాంటి భేషజాలకు పోకుండా చాలా సాధారణంగా ఉంటూ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఇతరుల అభిప్రాయాలను కూడా స్వీకరించే గుణం మాన్ కు ఉందన్నాడు.
భగవంత్ మాన్ పంజాబ్ కు సీఎం కావచ్చు కానీ తనకు స్వంత తమ్ముడి కంటే ఎక్కువ అని స్పష్టం చేశాడు సిద్దూ(Sidhu ). రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు తాను భగవంత్ మాన్ ను కలుస్తానని చెప్పారు.
పంజాబ్ పురోగతి కోసం ఇక్కడికి వచ్చా. సీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నాడు. అతడికి అహం లేదు అంతకంటే అహంకారం కూడా లేదన్నాడు.
భగవంత్ మాన్ 15 ఏళ్ల కిందట ఎలా ఉన్నాడో సీఎం అయ్యాక కూడా అలాగే ఉన్నాడని కొనియాడారు సిద్దూ.
మద్యం, ఇసుక తవ్వకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేబుల్ గుత్తాధిపత్యం, టెండర్ల విధానంలో అక్రమాలు, పోలీసులు, రాజకీయ నాయకులు, మాదక ద్రవ్యాల వ్యాపారుల మధ్య ఉన్న అనుబంధం, తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు సిద్దూ.
Also Read : పార్టీలో స్వీయ విమర్శ అవసరం