Bhagwant Mann : ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన భగవంత్ మాన్
కడుపు నొప్పి రావడంతో చికిత్స
Bhagwant Mann : ఇటీవలే పెళ్లి చేసుకున్న పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉన్నట్టుండి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. సడెన్ గా కడుపు నొప్పి రావడంతో వెంటనేఅపోలో ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు వెంటనే పరీక్షలు చేపట్టారు.
ఇందులో భగవంత్ మాన్(Bhagwant Mann) కు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐ వెల్లడించింది. కాగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అపోలో యాజమాన్యం వెల్లడించింది.
ఇదిలా ఉండగా అమృత్ సర్ సమీపంలో పంజాబ్ పోలీసులతో భారీ ఎదురు కాల్పుల తర్వాత ప్రముఖ పంజాబ్ సింగర్ సి్దూ మూసే వాలా హత్యలో ఇద్దరు అనుమానితుల్ని కాల్చి చంపారు.
కాగా రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్ లకు వ్యతిరేకంగా ఆపరేషన్ విజయవంతంగా అమలు చేసినందుకు పోలీసులను, యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్ ను పంజాబ్ సీఎం అభినందించారు.
హతమైన గ్యాంగ్ స్టర్ల ను జగ్రూప్ సింగ్ రూప, మన్ ప్రీత్ సింగ్ లుగా గుర్తించారు. వీరి నుండి ఏకే 47, పిస్టల్ ను ఎన్ కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో భగవంత్ మాన్ సీఎంగా కొలువు తీరాక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించారు. ఎవరైనా సరే తనకు ఫోన్ చేయాలని కోరారు. ఇదే సమయంలో తన కేబినెట్ లో అక్రమాలకు పాల్పడిన మంత్రిని డిస్మిస్ చేశారు.
ఇదే సమయంలో తాను చెప్పిన విధంగానే పలు పార్టీలకు చెందిన వారందరినీ జైలుకు పంపిస్తానంటూ ప్రకటించారు సీఎం.
Also Read : తాతకు వారసుడు అవుతాడా నాయకుడు
Punjab CM Bhagwant Mann admitted to hospital in Delhi
Read @ANI Story | https://t.co/VSMw7uQJJM#BhagwantMann #PunjabCM pic.twitter.com/FEloBfBkmJ
— ANI Digital (@ani_digital) July 21, 2022