Bhagwant Mann : 424 మందికి సెక్యూరిటీ తొల‌గింపు

పంజాబ్ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

Bhagwant Mann : పంజాబ్ సీఎం భ‌గవంత్ మాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే త‌న మంత్రివ‌ర్గంలో అవినీతికి పాల్ప‌డిన మంత్రిని కేబినెట్ నుంచి తొల‌గించారు.

దేశ చ‌రిత్ర‌లో ఇది ఓ సంచ‌ల‌నమేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 2015లో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌న కేబినెట్ లో ఓ మంత్రిని అవినీతి, ఆరోప‌ణ‌లు త‌లెత్త‌డం, విచార‌ణ‌లో నిజ‌మ‌ని తేల‌డంతో తొలగించారు.

ఆ త‌ర్వాత 7 సంవ‌త్స‌రాల‌కు 2022లో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann) ఈ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కంతో ఆమ్ ఆద్మీ పార్టీని న‌మ్మి అధికారాన్ని క‌ట్ట‌బెట్టార‌ని ఈ స‌మ‌యంలో తాను క‌ర‌ప్ష‌న్ ను ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు భ‌గ‌వంత్ మాన్.

సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి దాకా ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రైతుల‌కు భ‌రోసా క‌ల్పించారు.

32 వేల మంది అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు కింద ఎన్నో ఏళ్ల కింద‌ట ప‌ని చేస్తున్న వారంద‌రినీ ప‌ర్మినెంట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా రాష్ట్రంలో 424 మంది ప్ర‌ముఖుల‌కు ఉన్న సెక్యూరిటీ (భ‌ద్ర‌త‌)ను తొల‌గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ మేర‌కు రాష్ట్ర పోలీసు ఉన్న‌తాధికారిని వెంట‌నే తొల‌గిగంచాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం సీఎం తీసుకున్న ఈ అసాధార‌ణ నిర్ణ‌యం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది.

భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించిన వారిలో పంజాబ్ లో పేరొందిన వారు, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన పోలీస్ బాస్ లు, ప‌లు మ‌తాల‌కు చెందిన నాయ‌కులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉన్నారు.

గ‌త ఏప్రిల్ నెల‌లో ప‌లువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు స‌హా 184 మందికి సెక్యూరిటీ తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

 

Also Read : ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ. 5 ల‌క్ష‌ల ఫైన్

Leave A Reply

Your Email Id will not be published!