Bhagwant Mann : విప్ల‌వ వీరుల‌కు సీఎం లాల్ స‌లాం

ష‌హీద్ క‌న్న క‌ల‌లు నెర‌వేరుస్తాం

Bhagwant Mann : ఇప్పుడు దేశంలో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ఓ సెన్సేష‌న్. ఆయ‌న కొలువు తీరిన వెంట‌నే కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు. అవినీతి ర‌హిత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ష‌హీద్ స‌ర్దార్ భ‌గ‌త్ సింగ్ వ‌ర్దంతి సంద‌ర్భంగా విప్ల‌వ వీరులు భ‌గ‌త్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann). ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు.

అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అందుకే యాంటీ క‌రప్ష‌న్ హెల్ప్ లైన్ ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. విప్ల‌వ వీరుడు భ‌గత్ సింగ్ క‌న్న క‌ల‌ల్ని నిజం చేసేందుకు శాయ శ‌క్తులా కృషి చేస్తాన‌ని చెప్పారు.

ఎవ‌రైనా ప్ర‌జ‌లు త‌న వ‌ద్ద‌కు రావ‌చ్చ‌ని చెప్పారు. కానీ ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఓటు వేసిన వారే కాదు ఓటు వేయ‌ని వారు కూడా ఆప్ ప్ర‌జ‌లేన‌ని చెప్పారు.

అంతే కాదు లంచం అడిగితే వెంట‌నే వీడియో లేదా మెస్సేజ్ త‌న‌కు పెట్టాల‌ని పిలుపునిచ్చారు. తాను తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann).

విప్ల‌వం అంటే విందు భోజ‌నం కాద‌న్నారు. నూనుగు మీసాల య‌వ్వ‌నంలో సైతం దేశం కోసం బ‌లిదానం చేసిన వారి త్యాగం చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు.

సూర్య చంద్రులు ఉన్నంత కాలం వారు ఈ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతార‌ని అన్నారు భ‌గ‌వంత్ మాన్. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌న్నారు.

ఇక నుంచి అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో త‌న ఫోటోతో పాటు మోదీ ఫోటో ఉండ‌ద‌న్నారు. వీటి స్థానంలో భ‌గ‌త్ సింగ్ , అంబేద్క‌ర్ ఫోటోలు ఉండాల‌ని ఆదేశించారు సీఎం.

Also Read : ఈడీ దాడుల‌పై శివ‌సేన సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!